Top Ad unit 728 × 90

జెమోపాయ్‌ మినీ ఇ-స్కూటర్‌ మిసో…!

జెమోపాయ్‌ మినీ ఇ-స్కూటర్‌ మిసో…!

 

జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ మినీ విద్యుత్‌ స్కూటర్‌ 'మిసో'ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.44,000గా నిర్ణయించారు. గోరీన్‌ ఇ-మొబిలిటీ, ఒపాయ్‌ ఎలక్ట్రిక్‌లు సంయుక్తంగా జెమోపాయ్‌ను నెలకొల్పాయి. మిసో ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించామని, వచ్చే నెల నుంచి వినియోగదారులకు అందజేయడం ప్రారంభిస్తామని జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ వెల్లడించింది. ఒక సీటు మాత్రమే కలిగిన ఈ చిన్న స్కూటర్‌ను ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 75 కి.మీ ప్రయాణం చేయవచ్చు. కేవలం రెండు గంటల్లోనే 90 శాతం వరకు ఛార్జింగ్‌ చేయొచ్చని సంస్థ తెలిపింది. ఇబ్బందుల్లేని ప్రయాణాన్ని కోరుకునే వారికి మిసో అద్భుతమైన పరిష్కారమని జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ సహవ్యవస్థాపకుడు అమిత్‌ రాజ్‌ సింగ్‌ అన్నారు. ఈ స్కూటర్‌ నడపడానికి లైసెన్సు లేదా ఆర్‌టీఓ అనుమతులు అవసరం లేదు. మిసో గరిష్ఠ వేగం గంటకు 25 కి.మీ. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లలో లభించనుంది.

జెమోపాయ్‌ మినీ ఇ-స్కూటర్‌ మిసో…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *