Top Ad unit 728 × 90

దుర్గంధం వెదజల్లుతున్న నూజివీడు నగర రహదారులు


(నూజివీడు,): పేరుకే పట్టణంగా వర్ధిల్లుతున్న నూజివీడులో రానురాను రోడ్ల వెంట చెత్త పేరుకుపోయి, తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాలలో నిత్యం ఈ దృశ్యం ప్రజలకు కనిపిస్తూనే ఉంటుంది. అటుగా వెళుతున్న అధికారులు సైతం తమకు పట్టనట్టే వ్యవహరించారు పట్ల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నాళ్ళు ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగుతుండడంతో ఏ ఒక్క ప్రజా ప్రతినిధి, వార్డు ప్రజలు విన్నవించిన ప్పటికీ స్పందించిన దాఖలాలు కనపడటంలేదు. ఇటీవల ఎన్నికలు పూర్తయి, గెలుపొందిన అభ్యర్థులు పదవీ బాధ్యతలు చేపట్టారు. గెలుపొందిన ఉత్సాహంలో ప్రజాప్రతినిధులు మునిగితేలుతున్నారో.... ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేడితో రగులుతున్నారో... తెలియడం లేదు కానీ, మా ప్రాంతాలు మాత్రం పరిశుభ్రం కావడం లేదంటూ పలు వార్డులకు చెందిన పట్టణ ప్రాంత ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. డాక్టర్ తాతయ్య బాబు ఆసుపత్రి పక్క సందులో, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం సమీపంలో, బాపు నగర్, అజరయ్య పేట, యానాదుల కాలనీ, ఎమ్మార్ అప్పారావ్ కాలనీ, పోతిరెడ్డిపల్లి అడ్డరోడ్డు సమీపంలో, ఐటిఐ కళాశాల వద్ద, సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ఇ యనమదల ప్రధాన రహదారికి ఇరువైపులా చెత్త కుప్పలు పేరుకుపోయాయి. ఆహార వ్యర్థాలను సైతం రోడ్ల వెంటే పోయడం తో తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది. అటుగా వెళ్ళే వాహనచోదకులు పాదచారులు దుర్గంధం ధాటికి తట్టుకోలేక ముక్కులు మూసుకున్నారు. చెత్త తొలగించక పోవడంతో ఆవులు, పశువులు, మేకలు వాటిని నోటకరచుకొని, అనేక ఇబ్బందులకు గురి అవుతున్నాయి. ఇకనైనా మున్సిపల్ శాఖ అధికారులు సకాలంలో స్పందించి పారిశుద్ధ్య కార్మికుల చే చెత్తను ప్రధాన రహదారుల వెంబడే కాకుండా, సందు గొందుల్లో ను తొలగించి స్వచ్ఛ నూజివీడు పట్టణంగా తీర్చిదిద్దాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. కరోనా మహమ్మారి రెండవ పర్యాయము మరింతగా విజృంభిస్తున్న అత్యంత ప్రమాదకర ప్రస్తుత తరుణంలో చెత్తను పూర్తిగా పరిశుభ్రం చేసి, బ్లీచింగ్ చెల్లించి ప్రజల ఆరోగ్యాలను రక్షించాలని పట్టణవాసులు విన్నవి స్తున్నారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *