సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ
కృష్ణాజిల్లా- నూజివీడు
*గ్రామ ప్రజలు సహకారంతో ప్రశాంత వాతావరణంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహణ*
*కృష్ణా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు, నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక,అతి సమస్యాత్మక గ్రామాల్లో నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు , సిఐ వెంకట నారాయణ , నూజివీడు సర్కిల్ పరిధిలోని నూజివీడు రూరల్, పట్టణ, ముసునూరు, ప్రొబేషనరీ ఎస్ఐ, సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు*.*సీతారామపురం, పల్లెర్ల మూడి, ఎం ఎన్ పాలెం గ్రామాల్లో నిర్వహించిన కవాతు ఆద్యంతం ఆ ప్రాంత ప్రజలను ఎంతో చైతన్యం పరిచింది.ఈ ఫ్లాగ్ మార్చ్ నందు పోలీస్ సిబ్బంది అత్యంత ఉత్సాహంగా పాల్గొని ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు వినియోగించుకోవడానికి,మీ వెనుక పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.*
*ఈ సందర్భంగా డిఎస్పీ గ్రామ ప్రజలుకు ఎన్నికల ప్రవర్తన నియమావళి(MCC) గురించి తెలియజేస్తూ, ఎన్నికల సమయంలో ఎటువంటి ఘర్షణలు పడవద్దని, ఎన్నికలు సజావుగా జరపడానికి మరియు ప్రశాంత యుతంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులుకు సహాయపడలని ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా ఓటును వినియోగంచుకోవాలని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు.*
