Top Ad unit 728 × 90

అక్షయ్ ‘లక్ష్మీ బాంబ్’ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్…!


అక్షయ్ లక్ష్మీ బాంబ్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్…!

 

దర్శకుడు లారెన్స్ అక్షయ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ ఫిల్మ్ 'లక్ష్మీ బాంబ్' .కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ చిత్రం మే 22నే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని పేరుమోసిన సినిమాలు ఓటీటీల్లో రిలీజయ్యాయి. అమేజాన్ ప్రైమ్ సంస్థ వివిధ భాషల్లో పది సినిమాల దాకా ఓటీటీ రిలీజ్ కు రెడీ చేసింది. ఈ క్రమంలో అక్షయ్ 'లక్ష్మీ బాంబ్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేస్తూ, చిత్రానికి చెందిన రెండు పోస్టర్స్‌ను విడుదల చేశారు. సోమవారం హాట్ స్టార్ సంస్థ తాము రిలీజ్ చేయబోయే సినిమాల హీరోలను ఆన్ లైన్లోకి తీసుకొచ్చి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఆ సినిమాల ఆన్ లైన్ రిలీజ్ ను కన్ఫమ్ చేసింది. అక్షయ్ కుమార్ అజయ్ దేవగణ్ అభిషేక్ బచ్చన్ వరుణ్ ధావన్ ఆలియా భట్లతో 'బాలీవుడ్ కి హోమ్ డెలివరీ' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని హాట్ స్టార్ నిర్వహించగా, తమ సినిమాలు ఈ ఓటీటీలో త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు వారు ప్రకటించారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *