Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్‌ పనుల్లో జరిగిన ప్రమాదంలో టిప్పర్‌ ఢీకొని సూపర్‌వైజర్ వెంకటేష్ (33) మృతి కళావెంకట్రావు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వివాద రహితుడు, సౌమ్యుడు అజాతశత్రువు కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెట్టడం ఆటవిక చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకునే మార్గాన్ని సుగమం చేయనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త చట్టం: 15 ఏళ్లకు పైబడిన వాహనాలు ఇక చెత్తలోకే నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

చిరాకు పెట్టిస్తున్నాయని చీమలకు నిప్పు పెడితే చివరికి...!


చిరాకు పెట్టిస్తున్నాయని చీమలకు నిప్పు పెడితే చివరికి...!

 

చీమలు ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీశాయి. తమిళనాడు రాజధాని చెన్నై అమింజికరైలో ఆదివారం (నవంబర్ 22, 2020) న జరిగిన ఈ దారుణంపై కుటుంబ సభ్యులంతా కన్నీటి సముద్రంలో మునిగిపోయారు. చెన్నై అమింజికరైలోని పెరుమాల్ ఆలయం స్ట్రీటు కు చెందిన సత్యమార్తి దంపతులు, ఓ కూతురు, కొడుకుతో కలిసి నివాసముంటున్నారు. కూతురు సంగీత షోలింగనల్లూరులోని ఒక ఐటి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కొడుకు కాలేజీలో చదువుకుంటున్నాడు.

 

ఈ క్రమంలో వారి ఇంటి నిండా చీమలు పుట్టలు పెట్టాయి. ఇంట్లో ఉండే అన్ని పదార్ధాల్లోను చీమలు పేరుకుపోయి ఇబ్బంది పెడుతున్నాయి. ఎక్కడ చూసినా చీమలు, చీమలు, చీమలు. దీంతో సంగీతకు చికాకు వచ్చేసింది. ఎన్నో చీమల మందులు వాడింది. అయినా ఇంట్లో చీమలు తగ్గలేదు. దీంతో ఆమె చాల అసహనానికి గురైంది.

 

ఈక్రమంలో సంగీత తల్లి సహాయంతో చీమలపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. చీమలు చెల్లాచెదురుగా పారిపోతుంటే సంగీత వాటిపై కూడా కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. దీంతో ఆ మంటలు సంగీత బట్టలకు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించి ఒళ్లంతా పాకాయి. తల్లి, కూతురుకి అంటుకున్న మంటలు ఆర్పటానికి తీవ్రంగా యత్నించింది. కానీ సాధ్యం కాలేదు. మంటల్లో నిలువునా కాలిపోయిన సంగీత తల్లి కళ్లముందే సజీవదహనం అయిపోతుంటే ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. పెద్ద పెద్దగా కేకలు వేసింది. మంటలు ఆర్పటానికి యత్నించింది. ఆమె కేకలకు వేరే గదిలో ఉన్న తండ్రీ సోదరుడు వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు.

కళ్లముందే కొనఊపిరితో కొట్టుకుంటున్న సంగీతన పొరుగువారి సహాయంతో కిల్ పాక్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు.

 

కానీ శరీరం చాలా వరకూ కాలిపోవటంతో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం సంగీత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా కూతుర్ని రక్షించే యత్నంలో సంగీత తల్లికి కూడా చిన్న చిన్న గాయాలవ్వటంతో ఆమె చికిత్సపొందుతోంది. అందుకే నిప్పుతో మరియు నీటితో చలగాటం ప్రాణసంకటం అంటారు పెద్దలు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *