Top Ad unit 728 × 90

ప్రేమ పేరుతో యువకులకు చేరువై...!


ప్రేమ పేరుతో యువకులకు చేరువై...!

 

ప్రేమ పేరుతో యువకులకు చేరువై, పెళ్లిళ్లు చేసుకుని నగలు, నగదుతో ఉడాయించే సుహాసిని ఆర్థిక మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కడికక్కడ అవసరాల పేరుతో అప్పులు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెను అరెస్టు చేశారన్న సమాచారం తెలుసుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన వీరయ్య తిరుపతికి వచ్చి అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. వీరయ్యకు, సుహాసిని చిన్నప్పటి నుంచి తెలుసు. నాయుడుపేట మండలం కోనేటిరాజు పాళ్యానికి చెందిన మేనమామ వెంకటేశ్వర రాజుతో మొదటి వివాహం అయింది. ఆయనకు ఆరోగ్యం సరిలేనప్పటి ఫొటోలు చూపి వైద్యం కోసం అప్పు అడిగింది. ప్లాట్‌ పేపర్లు చూపించి పది రోజుల్లో అమ్మి అప్పు తీర్చేస్తానని రూ.2.17 లక్షల అప్పు తీసుకుంది. సకాలంలో చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాను. పోలీసుల సమక్షంలో ఇస్తానని నమ్మించి మూడేళ్లు ఎక్కడికో వెళ్లిపోయింది. భద్రాది కొత్తగూడెంకు చెందిన వినయ్‌, తిరుపతికి చెందిన మరో యువకుడిని మోసం చేసింది.

మొదటి భర్తకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి. మోసపోయిన వాళ్లు సుమారు 20 - 30 మంది వరకు ఉన్నారు. ఏవేవో కారణాలతో వారు బయటకు రాలేని పరిస్థితి. నా డబ్బులు తిరిగి ఇప్పించాలని వీరయ్య కోరారు. దీనిపై అలిపిరి పోలీసులు కూడా ఈ తరహా మోసాలు చేసిందని చెప్పారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *