Top Ad unit 728 × 90

District News :

నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌన్‌ తప్పదు...!


నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌన్‌ తప్పదు...!

 

ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే, ఆంక్షల సడలింపు ఎత్తివేయడంతో పాటు లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు. కరోనా వైరస్‌ను పూర్తిగా నియంత్రించేందుకు ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాల్సి ఉందని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ మహమ్మారిపై చేస్తోన్న పోరు స్వాతంత్య్ర సమరం వంటిదేనని ఆయన తెలిపారు. 'ప్రస్తుతం కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తున్నాం. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే.. మరోసారి లాక్‌డౌన్‌ విధించడం తప్ప మరో అవకాశం ఉండదు' అని పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన ఔషధాలు, వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆక్సిజన్‌ కొరత ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిఒక్కరినీ స్వాతంత్య్రం రాకముందు నాటి పరిస్థితుల్లోకి కరోనా మహమ్మారి తీసుకువెళ్లిందని ఉద్ధవ్‌ ఠాక్రే గుర్తుచేశారు. నిత్యం లక్షల సంఖ్యలో వ్యాక్సిన్‌లు పంపిణీ చేస్తున్నప్పటికీ, వైరస్‌ ముప్పు తొలగిపోలేదని అన్నారు.

 

కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయని, ఇటువంటివి దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఉద్ధవ్‌ ఠాక్రే సూచించారు. కాగా, కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా మహారాష్ట్ర పలు రకాల ఆంక్షలను కొనసాగిస్తూనే ఉంది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఆదివారం నుంచి లోకల్‌ రైళ్లలో సాధారణ ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నారు. షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, జిమ్‌, సెలూన్‌ ప్రదేశాల్లో పలు ఆంక్షలను కొనసాగిస్తున్నారు. బీచ్‌లతో పాటు పార్కులు, క్రీడామైదానాల్లో మాత్రం ఉదయం 6 నుంచి రాత్రి పదిగంటల వరకే అనుమతి ఇచ్చారు. అలాగే, ఈ నెల 17 నుంచి పాఠశాలలు ప్రారంభించడంపై రాష్ట్రస్థాయిలో కొవిడ్‌ పరిస్థితులపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ విముఖత చూపించింది. దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *