Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్‌ పనుల్లో జరిగిన ప్రమాదంలో టిప్పర్‌ ఢీకొని సూపర్‌వైజర్ వెంకటేష్ (33) మృతి కళావెంకట్రావు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వివాద రహితుడు, సౌమ్యుడు అజాతశత్రువు కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెట్టడం ఆటవిక చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకునే మార్గాన్ని సుగమం చేయనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త చట్టం: 15 ఏళ్లకు పైబడిన వాహనాలు ఇక చెత్తలోకే నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

ఆధ్యాత్మికత పేరుతొ అడ్డంగా దోచేసారు...!


ఆధ్యాత్మిక భావాలున్న నగర యువతిని, సైబర్నేరగాళ్ల ముఠా అదే భక్తి పేరుతో మోసం చేసింది. రూ. 4కోట్లు పంపుతున్నామంటూ రూ. 29.74లక్షలు కొల్లగొట్టింది. రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు ఢిల్లీకి చెందిన సైబర్గ్యాంగ్ఆటకట్టించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4పీఓఎస్మిషన్స్, ఒక ల్యాప్టాప్, మొబైల్ఫోన్స్, 74వేల డిపాజిట్స్లిప్స్, ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేశ్భగవత్వివరాలు వెల్లడించారు.

 

సఫిల్గూడ ప్రాంతానికి చెందిన యువతికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ భక్తి సంబం ధించిన విషయాలు షేర్చేస్తూ ఉంటుంది. ఒక రోజు ఆమె వాట్సాప్నంబరుకు +44 కంట్రీకోడ్నుంచి చిబూకే క్రిస్టియన్అనే వ్యక్తి మెసేజ్చేశాడు. మీ ఆధ్యాత్మిక భావాలు నన్ను కట్టిపడేశాయంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. తర్వాత -మెయిల్పంపి, రూ. 4 కోట్ల విలువ చేసే అమెరికా డాలర్లను పంపుతున్నట్లు పేర్కొన్నాడు. వాటిని భారత్లో పేదల సంక్షేమానికి వినియోగించాలని కోరాడు. దాంతో యువతి సరేనంది. తర్వాత ఆమెకు సోనియా శర్మ అనే యువ తి నుంచి ఫోన్వచ్చింది. కస్టమ్స్విభాగం నుంచి మాట్లాడుతున్నా, మీకు అమెరికా నుంచి పార్శిల్వచ్చింది. అందులో రూ. 4 కోట్లు విలువ చేసే అమెరికా డాలర్లున్నాయి. మీకు పార్శిల్అందాలంటే ఆర్బీఐ క్లియరెన్స్, జీఎస్టీ, కస్టమ్స్చార్జీలు, బీమా చెల్లించాల్సి ఉంటుంది అని వివరించింది.

 

అలా వేర్వేరు చార్జీల పేరుతో గత నెల 27 నుంచి నెల 6 వరకు విడతల వారీగా రూ. 29.74 లక్షలు కొల్లగొట్టింది. వారు చెప్పిన డబ్బు మొత్తం చెల్లించినా, పార్శిల్రాకపోవడంతో సోనియాకు ఫోన్చేసింది. ఆమె ఫోన్లు స్విచాఫ్అయ్యి ఉండడంతో మోసపోయినట్లు గుర్తించి రాచకొండ సైబర్క్రైమ్పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

రంగంలోకి దిగిన సైబర్క్రైమ్స్బృందం త్రిపుర, కోల్కతా, ఢిల్లీలకు చెందిన ఖాతాలకు బాధిత యువతి నుంచి డబ్బు వెళ్లినట్లు గుర్తించింది. చిబూకే క్రిస్టియన్అరిరిగుబునాము అనే నైజీరియా దేశస్థుడిని ఢిల్లీలో అరెస్టు చేసింది. పోలీసులు అరెస్టు చేసే సమయంలో నిందితుడు వారిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఏఆర్ఎస్సై, కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. అరెస్టు సమయంలో నిందితుడు చిబూకే తెలుగులో మాట్లాడడం గమనార్హం. మోసంలో చిబూకేకు సహకరించిన అరుణ్కుమార్అనే వ్యక్తిని కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. మరో నిందితురాలు సోనియాశర్మ పరారీలో ఉంది.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *