Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

హైదరాబాద్లో మళ్ళీ భారీ వర్షం...!


హైదరాబాద్లో మళ్ళీ భారీ వర్షం...!

 

హైదరాబాద్లో ఇటీవల వర్షాలు దంచికొట్టాయి. గత 100 ఏళ్లలో నగరంలో రెండో అత్యధిక వర్షపాతం నమోదైంది. వరద కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. వర్షాలు తగ్గిపోవడంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలుకుంటున్నాయి. కాగా రెండ్రోజులు పాటు గ్యాప్ ఇచ్చిన వర్షాలు హైదరాబాద్లో మళ్లీ దంచి కొడుతున్నాయి. కొద్ది సేపటి నుంచి నగరంలోనే పలు ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. లక్డీ కపూల్, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్ గూడ ప్రాంతాల్లో భారీ వర్షం మొదలయింది. అమీర్పేట, పంజా గుట్ట, కూకట్పల్లి మొదలగు చోట్ల కూడా కుండ పోత కురుస్తుంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఇక మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అక్టోబర్ 19 తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు, ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *