Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం:సెప్టెంబరు 30, 2020  బుధవారం | తిధి: చతుర్దశి  రా 10:53 తదుపరి పౌర్ణమి | నక్షత్రం: పూర్వాభాద్ర రా 2:53 తదుపరి ఉత్తరాభాద్ర | యోగం: గండం రా 8:45 | కరణం: గరజ ఉ 11:26 | సూర్యరాశి: సింహం | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6.06 | సూర్యాస్తమయం: 6:06 | రాహుకాలం: మ 12:00 - 1:30 | యమగండం: ఉ 7:30 - 9:00 | వర్జ్యం: ఉ 8:03 - 9:45 | దుర్ముహూర్తం: మ 11:54 - 12:46 | అమృతకాలం: సా 5:26 - 8:12 | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: చక్కగా జీవించి బ్రతికే వారికి చివాట్లు ఎక్కువ నవ్విస్తూ ఉండే వారికి బాధలు ఎక్కువ నమ్మినవారికే మోసాలుఎక్కువ | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

ఎంగిలి ప్లేట్‌లు కడుక్కొని ఇక్కడే బతుకుదాం, కానీ…!


ఎంగిలి ప్లేట్‌లు కడుక్కొని ఇక్కడే బతుకుదాం, కానీ…!

 

సమాజంలో మనుషులకు స్వేచ్చ ఎక్కువైన కొద్ది ఆశలు కూడా అందంగా తయారవడం మొదలుపెట్టాయి.. ఈ ఆశలు ఆడపిల్లను ఎంతకు దిగజార్చాయంటే, చివరికి ఉన్న ఊరును, కన్న వారిని, కట్టుకున్న వాడిని విడిచి దేశం కానీ దేశంలో బ్రతికేలా మార్చాయి. పోని అక్కడైనా సుఖపడుతుందా అంటే అదీ లేదు. అక్కడ ఆడదాని శరీరం ఓ పడక గదిలా మారింది. పదిమందికి సుఖాన్ని పంచే యంత్రంలా మిగిలింది. పడతి అంటే పూర్తి అర్ధమే మారిపోయింది. ఇలా మారిన ఓ మహిళ వ్యధ వింటే ఛీ ఆడపిల్ల బ్రతుకు ఎంత దుర్లభమైనదనే బాధ ప్రతి మనసులో మెదులుతుంది.

ఇదీ, గల్ఫ్ దేశాలకు వెళ్లొచ్చిన ఓ మధ్య తరగతి మహిళ దుర్భర అనుభవం.

 

అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఓ మహిళ దుబాయ్‌లో డబ్బు సంపాదన ఎక్కువగా ఉంటుందని స్థానికుల మాటలు విని, విధిలేని పరిస్థితుల్లో ఓ ఏజెంట్ ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లొచ్చింది. అక్కడి తన అనుభవాలను తెలుపుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అదేమంటే వంట మనిషిగా గల్ఫ్‌లో అడుగుపెట్టిన తనకు ఆ ఇంటి ఓనర్‌, ఆయన కొడుకు ఇద్దరూ నరకం చూపించే వారట. తండ్రీ, కొడుకులు ఇద్దరికీ తెలిసే తనతో శృంగారం జరిపారు.

 

వాళ్లిద్దరే కాక వారి కుటుంబ సభ్యుల్లోని మగ పిల్లలతోనూ శృంగారం చేయిస్తారు. మొదట ఇంటి ఓనరు కొడుకొస్తాడు. వాడొచ్చి వెళ్లిపోయాక గంట తరువాత ఇంకొకడొస్తాడు. వాడు వచ్చీ రాగానే నీళ్లు పోసుకుని బట్టలేసుకుని రూములోకి టీ తీసుకురమ్మంటాడు. అలా రూములోకి వెళ్లగానే తలుపుకు గడియ పెట్టేస్తారు. అమ్మా అని అరిచినా వదిలిపెట్టరు. అలా వరుస పెట్టి సాయంత్రం వరకు 15 మంది వరకు వస్తారు.. అలాంటివన్నీ చెప్తే మానం పోతుందని తనలో అంతవరకు రగులుతున్న అగ్నిపర్వతాన్ని కన్నీళ్లతో ఆర్పేసుకోవడానికి ప్రయత్నం చేసింది ఆ మహిళ.

 

అందుకే నాలాంటి కష్టాలు గల్ఫ్ లో మరెవ్వరు పడకుండా ఉండేందుకు ప్రతి ఇళ్లు తిరిగి అవగాహన కల్పిస్తున్నా. మీరు కూడా నాలాంటి ఆడవారే అని చెప్తున్నా. పది రూపాయల కూలీ వచ్చినా పర్వాలేదు ఎంగిలి ప్లేట్‌లు కడుక్కొని ఇక్కడే బతుకుదాం అని అక్కడి పరిస్థితులు చెప్పి గల్ఫ్‌కు వేళ్లే వారిని చాలా మందిని ఆపేశా అంటూ చెప్పుకొచ్చింది ఈ గల్ఫ్ మహిళా బాధితురాలు. నిజమే కదా మన పాదాలు భూమి మీద ఉన్నంత వరకు ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు ఒక్క సారి ఆ పాదాలు గాల్లోకి లేచాయంటే మన పట్టు తప్పుతుంది, జీవితం పట్టుతప్పిపోతుంది. అందుకే ఆశలు ఆకాశంలో ఎగిరే పక్షి వంటివి, ఎప్పుడైనా వేటగాడి బాణానికి తగిలి మరణించవచ్చూ, అని గ్రహించమంటున్నారు పెద్దలు.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *