Top Ad unit 728 × 90

రూ.500కే కరోనా టెస్ట్, 90 నిముషాల్లో రిజల్ట్…!


రూ.500కే కరోనా టెస్ట్, 90 నిముషాల్లో రిజల్ట్…!

 

కరోనా నిర్ధారణ చేయాలంటే సాధారణ విషయం కాదు. ప్రభుత్వాలకు చాలా ఖర్చు అవుతుంది. దాదాపు ఒక్కో పరీక్షకు రూ. 5000 వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కరోనా లక్షణాలు కన్పించిన ప్రతి ఒక్కరినీ పరీక్షించేందకు ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ కష్టాలనుంచి బయటపడేసేందుకు బెంగాల్‌లోని ఓ బయోటెక్ కంపెనీ సరికొత్త ఆవిష్కరణ చేసింది. కేవలం రూ.500 ఖర్చుతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే విధంగా ఓ పరికరాన్ని కనిపెట్టింది. వివరాల్లోకి వెళితే… బెంగాల్ రాజధాని కలకత్తాలోని జీసీసీ బయోటెక్ ఇండియా చాలా రోజుల నుంచి కరోనా వైరస్‌ను గుర్తించేందుకు పరికరాలను తయారు చేయడంలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఓ కొత్త ఆవిష్కరణ చేసింది. అదే రియల్‌ టైం కరోనా టెస్టింగ్ కిట్.

 

ఈ పరికరంతో కేవలం 90 నిముషాలలో వ్యక్తికి కరోనా ఉందో లేదో తేల్చి చెప్పవచ్చు. అంతేకాకుండా దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. దీనికి సంభంధించి జీసీసీ బయోటెక్ ఇండియా ఎండీ ఆర్ మజుందార్ మాట్లాడుతూ, ఇప్పటికే కోటి టెస్టింగ్ కిట్లను తయారు చేశామని, ఈ కిట్ వల్ల డబ్బుతో పాటు, సమయంలో కూడా ఆదా అవుతుందని చెప్పారు. కరోనా వ్యాప్తిని కూడా నియంత్రించేందకు ఇది ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *