Top Ad unit 728 × 90

ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు…!


ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు…!

 

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా విడుదలైన నోటిఫికేషన్ లో అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8లోగా రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేస్తారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 9న ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

 

డెలివరీ ఎగ్జిక్యూటీవ్, సీనియర్ అసిస్టెంట్ విభాగాల్లో 100 ఖాళీలకు టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లయ్ చేయవచ్చు. అభ్యర్థులకు స్మార్ట్ ఫోన్, బైక్, టూ వీలర్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. నెలకు రూ.13 వేల నుంచి రూ.15వేల వరకు వేతనం చెల్లిస్తారు. పెట్రోల్ అలవెన్స్, మొబైల్ బిల్, ఇతర ఇన్సెంటీవ్స్ కూడా ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏపీలో పని చేయాల్సి ఉంటుంది.

 

సీనియర్ అసిస్టెంట్ విభాగంలో 150 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. నెలకు రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. పురుషులు/స్త్రీలు ఉద్యోగాలకు అప్లయ్ చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.

 

ఈ నెల 8లోగా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల మొబైల్ నంబర్లకు గూగుల్ మీట్ ఇంటర్వ్యూ లింక్ పంపిస్తారు. ఇతర వివరాలకు 8978524022, 7780558838 నెంబర్లను సంప్రదించవచ్చు.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *