Top Ad unit 728 × 90

అమెరికాలో ఇప్పుడు వీళ్ళ ఆస్తుల గురుంచే చర్చ జరుగుతోందట ...!


అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె ఇవాంకల మధ్య సంబంధం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయికి చేరుకున్నదని అమెరికా మీడియా కోడై కూస్తున్నది. రెండో సారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చొని పరాజం పాలైన మెలానియా.. మొదట్లోనే ఓటమిని స్వీకరించాలని ట్రంప్కు సూచించారు. ప్రస్తుతం శ్వేతసౌధాన్ని వీడగానే ట్రంప్ నుంచి విడాకులు తీసుకోవాలని మెలానియా యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ నుంచి మెలానియా విడాకులు పొందినట్లయితే.. ఆమెకు రూ.500 కోట్ల మేర భరణంగా అందొచ్చని న్యాయనిపుణులు తేల్చారు. అయితే, ఇదే సమయంలో ట్రంప్ భార్య, కుమార్తెల ఆస్తులపై ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇవాంకాతోపాటు ట్రంప్ నలుగురు పిల్లలకు మెలానియా సవతి తల్లి కూడా.

 

1998 లో డొనాల్డ్ ట్రంప్ను కలవడానికి ముందు మెనాలియా న్యూయార్క్లో విజయవంతమైన మోడల్గా ఉన్నారు. వోగ్, వానిటీ ఫెయిర్, న్యూయార్క్ మ్యాగజైన్ సహా ముఖ్యమైన, పెద్ద క్లయింట్ల కోసం పనిచేసిన మెలానియా పెద్ద మొత్తంలో సంపదను కూడగట్టుకున్నారు. ఆమె గతంలో కొన్ని విజయవంతమైన వ్యాపారాలను కూడా కలిగి ఉన్నారు. ప్రస్తుతం, మెలానియాకు 38.6 మిలియన్ పౌండ్ల సంపద ఉంటుందని సెలెబ్రిటీ నెట్ వర్త్ సంస్థ తెలిపింది. తన మోడలింగ్ వృత్తి నుంచి డబ్బు సంపాదించడమే కాకుండా, ఆభరణాల సేకరణ ద్వారా మెలానియా టైమ్పీస్ వంటి వ్యాపారాలను కూడా కలిగి ఉన్నారు. ఇవి విలాసవంతమైన ఆభరణాలను విక్రయిస్తాయి. అమెరికా, లండన్, ఫ్రాన్స్లలో రకం ఆభరణాలకు ధనవంతులు ఎక్కువ మక్కువ చూపుతారని సమాచారం. యాంటీ-ఏజింగ్ ప్రొడక్ట్స్తో పాటు చర్మ సంరక్షణ వస్తువులను విక్రయించే మెలానియా స్కిన్ కేర్ కలెక్షన్ వ్యాపారం కూడా ఆమెకు ఉన్నది.

 

మరోవైపు ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా నికర ఆస్తుల విలువ 289 మిలియన్ పౌండ్లుగా మీడియా సంస్థ ఫోర్బ్స్ తెలిపింది. ఇది ఆమె సవతి తల్లి మెలానియా ట్రంప్ కంటే ఎక్కువ అని స్పష్టం చేస్తుంది. మెలానియా మాదిరిగానే ఇవాంకా కూడా మోడల్గా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. అనంతర కాలంలో వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇవాంకా కుటుంబ యాజమాన్యంలోని ట్రంప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. కొన్ని నివేదికల ప్రకారం, ప్రస్తుత కాలంలో ఇవాంకా 27 మిలియన్ పౌండ్లు సంపాదించింది. ట్రంప్ హోటల్ ఇంటీరియర్ డిజైన్ను కూడా ఇవాంకా నిర్వహిస్తున్నారు. తండ్రి నుంచి భరణంగా పెద్ద మొత్తంలో ఆస్తులు, నగదు రానిపక్షంలో సవతి తల్లి కన్నా ఇవాంకనే ధనవంతురాలిగా ఉంటుందని అమెరికన్ మీడియా పేర్కొంటున్నది.

 

Tags: pslv tv,america news,ivanka,trump,melania,assets,discussion


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *