Top Ad unit 728 × 90

విశ్లేషణ: ఏపిలో వార్ వన్ సైడ్ ఎలా అయ్యింది...!


విశ్లేషణ: ఏపిలో వార్ వన్ సైడ్ ఎలా అయ్యింది...!

 

నగర పంచాయతీ నుంచి మొదలై మున్సిపాలిటీ మీదు కార్పొరేషన్ దాకా అన్ని ఏరియాల్లో వైసీపీ ఫ్యాన్ గిర్రున తిరిగింది. ఆ హవాలో మిగిలిన పార్టీలన్నీ కొట్టుకుపోయాయి. మరి ఈ స్థాయిలో వైసీపీ ప్రభంజనం సృష్టించడానికి కారణాలు ఏంటి…? మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై ఆ పార్టీకున్న లెక్కలేంటి…? సీఎం జగన్ ప్రచారం చేయకపోయినా వైసీపీ వార్ ని వన్ సైడ్ ఎలా చేయగలిగింది…? అన్ని ఏరియాల్లో ఎలా గెలిచింది.

 

కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చెయ్యలేదు. సీఎం జగన్ ప్రచారం చెయ్యలేదు. అయినా రిజల్ట్ దద్దరిల్లిపోయింది. నిజంగా ఇది ఆశ్చర్యకరమే. ఏపీలో పల్లె తీర్పును మించిన తీర్పు ఇది. పట్టణాల్లో ఫలితం వైసీపీ వైపే ఉంటుందని అంతా ఊహించారు. కానీ, అది ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ అంచనా వేయలేదు. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఇలా అన్ని ఏరియాల్లో మెజారిటీ వార్డుల్లో ఫ్యాన్ గిర్రున తిరిగింది. వైసీపీ జెండా రెపరెపలాండింది. ఎన్నికలు జరిగిన ప్రతి జిల్లాలో వైసీపీ విక్టరీ రీసౌండ్ వచ్చింది.

 

మున్సిపల్ ఎన్నికల కోసం టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. పట్టణాల కోసం పది హామీలంటూ జనంలోకి వెళ్లింది. ఆస్తిపన్ను పాత బకాయిల రద్దు, ప్రస్తుత శ్లాబ్ లో సగమే విధిస్తామని హామీలు ఇచ్చింది. పట్టణ పేదలకు శాశ్వత ఇళ్ల నిర్మాణం, ప్రతి ఇంటికి ఉచిత నల్లా కనెక్షన్ తో పాటు నీటి పన్నులు కూడా రద్దు చేస్తామన్నారు. అదే, వైసీపీకి ఓటు వేస్తే ఆస్తి పన్నులు, ఇంటి పన్నులు బాదేస్తారని టీడీపీ బాగా ప్రచారం చేసింది. ఎవరి ఇంటికి ఎంత పన్ను పడుతుందో వివరిస్తూ ఇంటింటికి తిరిగారు.

 

తాము గెలిచే మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను పెంచబోమని, సగానికి తగ్గిస్తామని చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. ప్రజల్లో ఉన్న పన్ను భయాలను ఓట్లుగా మార్చుకునేందుకు టీడీపీ ఎంతో ప్రయత్నించింది. పన్నుల పెంపుపై టీడీపీ ఇంతగా ప్రచారం చేసినా, వైసీపీ ఎక్కడా పన్నులు తగ్గిస్తామని చెప్పలేదు. టీడీపీ చేసిన ప్రచారాన్ని పట్టణ ప్రజలు నమ్మలేదు. ఫ్యాన్ గాలే బెటర్ అనుకున్నారు.

 

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైసీపీ కొత్తగా ఏ హామీ ఇవ్వలేదు. లాంఛనానికైనా మేనిఫెస్టోని రిలీజ్ చెయ్యలేదు. ఆఖరికి సీఎం జగన్ కూడా ప్రచారం చెయ్యలేదు. పైగా, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుతామని ఎన్నికలు ముందే చెప్పారు. ఎలాంటి హడావుడి లేకుండా ఎన్నికల్లోకి దిగింది వైసీపీ. అయినా రిజల్ట్ దద్దరిల్లిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను నమ్ముకునే ఎన్నికల రంగంలోకి దిగింది వైసీపీ.

 

అందుకే, ఎన్నికల నాటి పథకాలే ఇప్పుడూ పని చేశాయి. ఫలితాన్ని ఏకపక్షం చేసేశాయ్. పైగా ఇటీవలి కాలంలో ఏపీలో బాగా పేలిన రెండు కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి పెన్షన్ ఇంటికి తెచ్చివ్వడం, రెండోది రేషన్ బియ్యం, సరుకుల డోర్ డెలివరీ. ఇవి ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. ఈ రెండు పనులు ప్రజల పట్ల వారికి అందాల్సిన సర్వీస్ పట్ల ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ ఏంటో అందరికి అర్థం అయ్యేలా చేశాయి. ఇవి పట్టణ ఓటర్లను బాగా ఆకర్షించాయి.

 

సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరక్కుండా వార్డు వాలంటీర్లను నియమించడం కూడా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసినట్లు అయ్యింది. అంతకుముందే పెన్షన్లను పెంచడం, అమ్మఒడి, చేయూత ఇతర పథకాలన్నీ వైసీపీకి బాగా కలిసొచ్చాయి. అందువల్లే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా, ఓటర్లంతా వైసీపీకి మద్దతుగా నిలిచారు. క్లీన్ స్వీప్ చేసేలా గెలిపించారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *