Top Ad unit 728 × 90

భవిష్యత్తు అంతా టెక్నాలజీ కోర్సులదే అందుకు తగ్గట్టుగా ఇంటర్ లో కొత్త కోర్సులు


భవిష్యత్తు అంతా టెక్నాలజీ కోర్సులదే అందుకు తగ్గట్టుగా ఇంటర్ లో కొత్త కోర్సులు

 

టెన్త్ పూర్తి కాగనే ఏ ఎంపీసీనో, బైపీసీ నో తీసుకుంటం పరిపాటి. కాదంటే సీఈసీ, హెచ్ఈసీ సెలెక్ట్ చేసుకుంటాం సాదారణంగా. అది కాదంటే ఓకేషనల్ కోర్స్ ఉండనే ఉన్నాయి. ఇలా రొటీన్ కోర్సులు కాకుండా, ఇప్పుడున్న అవసరాలకు తగ్గట్టుగా ఉండే కోర్సులు ఏమి లేవని నిరాశ అవసరంలేదు. ఎందుకంటే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. భవిష్యత్తు అంతా టెక్నాలజీ కోర్సులదే అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పటికే అలాంటి కోర్సులకు డిమాండ్ బాగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని... టెక్నాలజీపై స్టూడెంట్స్‌కి నాలెడ్జ్ పెంచేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కొన్ని షార్ట్ టెర్మ్ కోర్సులను ప్రవేశపెట్టబోతోంది. ఇవి మొత్తం 9 కోర్సులు ఉన్నాయి. వీటిని వేసవి సెలవులు అయిపోయాక, 2021-22 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతోంది. వీటికి సంబంధించి ఆల్రెడీ సిలబస్ కూడా రెడీ చేసిందంట. ఈ కోర్సుల సిలబస్‌ను జేఎన్‌యూ (హైదరాబాద్) ప్రొఫెసర్లకు ఇస్తుంది. వారు దీన్ని మొత్తం పరిశీలిస్తారు. ఎలా ఉందో చూస్తారు. ఏమైనా మార్పులు చేయాలంటే చెయ్యమని చెబుతారు. వేసవి సెలవుల సమయంలో... ఈ మార్పులు జరిగిపోతాయి. సరిగ్గా కాలేజీలు తెరవగానే, కొత్త కోర్సులు పలకరిస్తాయి. అయితే ఇవి సంవత్సరమంతా చదివే కోర్సులు కావు. కొంతకాలమే ఉంటాయి. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన పెరుగుతుంది. ఉద్యోగాలు పొందేందుకు వీలవుతుంది. స్వల్పకాలిక కోర్సు నచ్చితే, అప్పుడు పూర్తి స్థాయిలో అదే కోర్సును చదివి, అందులోనే ఉపాధి అవకాశాలు వెతుక్కోవచ్చు.
 

కొత్త కోర్సుల లిస్టు
1. ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ 
2. మెషిన్‌ లెర్నింగ్‌
3. రోబోటిక్స్‌
4. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ
5. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ
6. కోడింగ్‌
7. ఎంబెడ్‌ సిస్టమ్‌
8. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

9. ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *