Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పర్వతారోహణ శిక్షకురాలు అన్వితా రెడ్డి, ఐపీఎస్‌ అధికారి తరుణ్‌జోషితో కలిసి టాంజానియాలోని కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు. నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ హనుమాన్ పేట బైపాస్ వద్ద దారుణం జరిగింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని బావ గఫార్‌ను బావమరిది సలీం హత్య చేశాడు. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో జనవరి 21 సువర్ణాక్షరాలతో రాయదగిన రోజు. 145 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న ఈ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ తొలిసారి 50,000 పాయింట్లను దాటింది. మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

పెంపుడుకుక్కను దారుణంగా కారుకు కట్టి నడిరోడ్డుపై...!


పెంపుడుకుక్కను దారుణంగా కారుకు కట్టి నడిరోడ్డుపై లాక్కెళ్లిన క్రూర చర్య సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అదీ 62 ఏళ్ల ఒక పెద్దాయన కనీసం కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించిన వైనంపై నెటిజన్లులు మండిపడుతున్నారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో శుక్రవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తనను బాగి విసిగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన యూసఫ్ ఆప్రాంతం నుండి కుక్కను దూరంగా తీసుకెళ్లి వదిలిరావాలని అనుకున్నాడు. అంతే క్షణం ఆలోచించకుండా... ఏ మాత్రం దయ లేకుండా కుక్కను కారుకు కట్టేసి మరీ లాక్కెళ్లిపోయాడు. ఈ అమానుషాన్ని గమనించిన అఖిల్ అనే బైకర్ వీడియో తీశారు. ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తామంటూ ఆయన యూసఫ్‌ను అడ్డుకుని ప్రశ్నించారు. అయితే, నీకేంటి సమస్య అంటూ వాదించిన యూసఫ్‌ చివరకు కుక్కకు కట్టిన తాడును వదిలించి అక్కడినుంచి వెళ్లి పోయారు. దీనిపై వ్యవహారంపై అఖిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కారు యజమాని యూసుఫ్‌పై చెంగమండ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జంతువుల క్రూరత్వాన్ని నిరోధించే (ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్, 1960) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడిని అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశామని పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన కుక్కను ప్రభుత్వ పశువైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించినట్టు చెప్పారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *