దేశంలో కొత్తగా 13,313 మందికి కరోనా
దేశంలో కొత్తగా 13,313 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం 12 వేలకుపైగా కేసులు నమోదవగా, కొత్తగా 13,313 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,33,44,958కి పెరిగాయి.
ఇందులో 4,27,36,027 మంది బాధితులు కోలుకోగా, 83,990 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,941 మంది బాధితులు మృతిచెందారు. కాగా, బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 38 మంది మరణించగా, 10,972 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.19 కేసులు యాక్టివ్గా ఉండగా, రికవరీ రేటు 98.60, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. రోజువారీ రికవరీ రేటు 2.03 శాతానికి పెరిగిందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 196.62 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.
Nice view of autumn
Reviewed by admin
on
Sunday, September 07, 2014
Rating:
