Top Ad unit 728 × 90

అద్భుతమైన గోల్‌ చేసినా, సంబరాలకు దూరం...!


అద్భుతమైన గోల్‌ చేసినా, సంబరాలకు దూరం...!

 

ఫిఫా వరల్డ్‌ కప్‌లో గ్రూప్‌ జీ దశలో స్విట్జర్లాండ్‌, కామెరూన్‌ జట్ల మధ్య హోరా హోరీగా పోరు జరుగుతోంది.

 

అనూహ్యంగా స్విస్‌ స్ట్రైకర్‌ బ్రీల్‌ ఎంబోలో అద్భుతమైన గోల్‌ చేశాడు. మ్యాచ్‌లో ఇదే మొదటి గోల్‌. దీంతో జట్టంతా ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయింది. అయితే గోల్‌ చేసిన బ్రీల్‌ మాత్రం కదలకుండా అక్కడే ఉండిపోయాడు. గోల్‌ చేసిన ఆనందం ఏమాత్రం ఆయన ముఖంలో కనిపించలేదు. పైగా, తప్పుచేసిన వాడిలా ముఖం దించేశాడు. ఎందుకో తెలుసా?

 

బ్రీల్‌ ఎంబోలో కామెరూన్‌ రాజధాని యావొండేలో జన్మించాడట. ఆ తర్వాత అతడి తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి, ఎంబోలోను తీసుకొని స్విట్జర్లాండ్‌ బాసెల్‌కు వచ్చి స్థిరపడ్డారు. కామెరూన్‌లో పుట్టినప్పటికీ ఆయన విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగింది. దీంతో జన్మనిచ్చిన దేశంపైనే గోల్‌ కొట్టి సంబరాలు చేసుకోవడం ఏంటి? అనుకున్నాడేమో... సహచర ఆటగాళ్లంతా ఆనందంతో గంతులేస్తున్నా... బ్రీల్‌ మాత్రం వారికి దూరంగా ఉన్నాడు.

 

స్విట్జర్లాండ్‌దే విజయం

హోరోహోరీగా సాగిన పోరులో చివరికి స్విట్జర్లాండే విజయం సాధించింది. అది కూడా 48వ నిమిషంలో బ్రీల్‌ ఎంబోలో చేసిన ఏకైక గోల్‌తో స్విస్‌ విజయం సాధించడం గమనార్హం. మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధం ప్రారంభమైన కొద్ది సేపటికే బీల్‌ ఎంబోలో అద్భుత గోల్‌ చేయడంతో 1-0 తేడాతో కామెరూన్‌పై స్విస్‌ విజయం సాధించింది.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *