గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న...!
గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న...!
PSLVTV(ఏలూరు): గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అక్రమ దారులపై ఉక్కుపాదం మోపిన ద్వారకాతిరుమల ఎస్సై టి. సుధీర్ బాబు వారి యొక్క సిబ్బంది వాహన తనిఖీలలో సుమారు 30 లక్షలు విలువైన 350 KG’s గంజాయి స్వాధీనం.
ద్వారకాతిరుమల PS. Cr. No: 228/2022 U/S 8 (C) R/W 20(b) (11) (C) of NDPS. Act 1985 of Dwaraka Tirumala P.S
విషయము: ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారికి రాబడిన సమాచారం మేరకు ఏలూరు జిల్లా అడిషినల్ ఎస్పి (అడ్మిన్) చక్రవర్తి గారు, ఏలూరు ఇంచార్జ్ డిఎస్పీ శ్రీ పైడేశ్వరరావు గార్ల పర్యవేక్షణలో, భీమడోలు ఇంచార్జ్ సిఐ శ్రీ ఎం. వెంకటేశ్వరరావు గారి అద్వర్యంలో ద్వారకాతిరుమల ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది ఈరోజు ఉదయం గుణ్ణంపల్లి హైవే వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి అక్రమ రవాణా చేయుచున్న ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న 3 గురు వ్యక్తులు పోలీసువారిని చూసి పారిపోతుండగా ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలసి వారిని పట్టుకొనుటకు ప్రయత్నించగా వారిలో ఒక వ్యక్తి పారిపోగా ఇద్దరినీ అదుపులోకి తీసుకోవడమైనది.
సిద్దిపేట జిల్లా, జహీరాబాద్ మండలం షేకాపూర్ తండాకు చెందిన చౌహాన్ విజయ్ కుమార్ మరియు మల్చల్ గ్రామానికి చెందిన మ్యాతరి ప్రదీప్, పారిపోయిన వ్యక్తి అయిన హైదరాబాద్ మియాపూర్ కు చెందిన విజయ్ లు చింతూరు ఏజెన్సి నుండి TS 28 B 9651 నెం.గల తెలుపు రంగు ఇన్నోవా కారులో సుమారు 350 కేజీల గంజాయిని 14 బస్తాలలో నింపుకొని చింతూరు ఏజన్సీలో రమేష్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి గంజాయిని ఆక్రమముగా రవాణా చేస్తున్నా దానిపై ఇన్నోవా కారుని స్వాధీనం చేసుకొని అందులో రవాణా చేయబడుతున్న 350 కేజీల గంజాయిని సీజ్ చేసి, సదరు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడమైనది.
నిందితులు: చౌహాన్ విజయ్ కుమార్, తండ్రి: రూప్ సింగ్, 25 సం.లు, కులం: ST-లంబాడి, షేకాపూర్ తండా, జహీరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణా రాష్ట్రం. మ్యాతరి ప్రదీప్, తండ్రి గోపాల్, వయస్సు-28 సం:లు, కులం SC-మాదిగ, మల్చల్ గ్రామం, జహీరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణా రాష్ట్రం 3. విజయ్, మియాపూర్, హైదరాబాద్ (Absconding), 4. రమేష్, చింతూరు ఏజన్సీ (అరెస్టు చేయవలసిన ముద్దాయి).
స్వాదినపరచుకున్న సొత్తు:
1. గంజాయి 350 కిలోలు (విలువ సుమారు 30 లక్షలు)
2.TS 28 B 9651 అను నెంబర్ గల ఇన్నోవా కారు
కేసు దర్యాప్తులో పాల్గొన్న సిబ్బంది: భీమడోలు ఇంచార్జ్ CI శ్రీ M. వెంకటేశ్వరరావు గారు, HC 69. రాజ్ అహ్మద్. SI T. సుదీర్ (ద్వారకాతిరుమల PS) PC 2156 M. శ్రీను 470 S. రాంపండు, HG108 N.V.రత్నం, HG 800 .J. ప్రకాష్ బాబు.
సేకరణ: రవి పామర్తి (ఆంధ్రప్రదేశ్-ఇంచార్జ్)
