Top Ad unit 728 × 90

నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధం, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు వీరే...!


జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం మూడు సర్కిళ్ల కార్యాలయాలు సర్వం సన్నద్ధమయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ జారీతో మూడు సర్కిళ్ల కార్యాలయాలలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేపడుతున్నారు. బుధవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించనుండటంతో జీహెచ్ఎంసీ సర్కిళ్ల అధికారులు దిశగా సర్కిళ్లు, డివిజన్ల వారీగా ఏర్పాట్లు మొదలు పెట్టారు. ప్రధానంగా హయత్నగర్ సర్కిల్లోని నాలుగు డివిజన్లకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ చేపట్టేందుకు ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల కార్యాలయం రెండో అంతస్తులో నాగోలు, మన్సూరాబాద్, హయత్నగర్, బీఎన్రెడ్డినగర్ డివిజన్ల నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకుని ఎన్నికల క్రతువు నిర్వహించేందుకు డివిజన్ల వారీగా రిటర్నింగ్ అధికారుల చాంబర్లను ఏర్పాటు చేశారు.

 

ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని డివిజన్లకు మూడు సర్కిళ్ల కార్యాలయంలోని మొదటి అంతస్తులో వనస్థలిపురం, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ డివిజన్లకు సంబంధించిన రిటర్నింగ్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు.

 

సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని డివిజన్లకు మూడు సర్కిళ్ల కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లోని వివిధ సెక్షన్లలో సరూర్నగర్, ఆర్కేపురం, కొత్తపేట, చైతన్యపురి, గడ్డిఅన్నారం డివిజన్ల రిటర్నింగ్ అధికారుల చాంబర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.

 

హయత్నగర్ సర్కిల్ పరిధిలో

నాగోలు డివిజన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం: ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల కార్యాలయంలోని రెండో అంతస్తు, హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 1 చాంబర్: రిటర్నింగ్ అధికారి: ప్రవీణ్కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి: కె. రామారావు

 

మన్సూరాబాద్ డివిజన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం

ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల కార్యాలయంలోని రెండో అంతస్తు, హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 2 చాంబర్ : రిటర్నింగ్ అధికారి: జి. సాయినాథ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి: కె. శ్రీకాంత్రెడ్డి

 

హయత్నగర్ డివిజన్ రిటర్నింగ్అ ధికారి కార్యాలయం

ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల కార్యాలయంలోని రెండో అంతస్తు, హయత్నగర్ సర్కిల్లోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం: రిటర్నింగ్ అధికారి: బి. ప్రశాంతి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి: జి. జయచందర్రెడ్డి

 

బీఎన్రెడ్డినగర్ డివిజన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం

ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల కార్యాలయంలోని హయత్నగర్ సర్కిల్ రెండో అంతస్తు, అసిస్టెంట్ టౌన్ప్లానింగ్ అధికారి కార్యాలయం: రిటర్నింగ్ అధికారి శశికళ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి: సి. రాందాస్

 

ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో, వనస్థలిపురం డివిజన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం...

ఎల్బీనగర్ సర్కిల్ మొదటి అంతస్తులోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం: రిటర్నింగ్ అధికారి జి. శోభారాణి: అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి: ఎన్. మాధవరెడ్డి

 

హస్తినాపురం డివిజన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం

ఎల్బీనగర్ సర్కిల్ మొదటి అంతస్తులోని అసిస్టెంట్ సిటీ ప్లానర్ కార్యాలయం: రిటర్నింగ్ అధికారి కె. ఎస్తర్: అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి: ఎం. సురేఖ

 

చంపాపేట డివిజన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం

ఎల్బీనగర్ సర్కిల్ మొదటి అంతస్తులోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఇంజినీరింగ్ విభాగం) కార్యాలయం : రిటర్నింగ్ అధికారి శ్రీరాం రాములు: అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి: ఎస్. కిషన్

 

లింగోజిగూడ డివిజన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం...

ఎల్బీనగర్ సర్కిల్ మొదటి అంతస్తులోని ఎలక్ట్రికల్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం : రిటర్నింగ్ అధికారి చిరంజీవాచారి: అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి: . లక్ష్మయ్య

 

సరూర్నగర్ సర్కిల్ పరిధిలో, సరూర్నగర్ డివిజన్ రిటర్నింగ్ కార్యాలయం

సరూర్నగర్ సర్కిల్ గ్రౌండ్ ఫ్లోర్లోని ఉప కమిషనర్ చాంబర్ ఎదురుగా ఉన్న భవనం కార్యాలయం: రిటర్నింగ్ అధికారి పి. ఝాన్సీ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి: కె. భాస్కర్

 

ఆర్కేపురం డివిజన్ రిటర్నింగ్ కార్యాలయం

సరూర్నగర్ సర్కిల్ గ్రౌండ్ ఫ్లోర్లోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ చాంబర్ రూం నంబర్ 6 : రిటర్నింగ్ అధికారి వి. పద్మ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి : కె. శేఖరయ్య

 

కొత్తపేట డివిజన్ రిటర్నింగ్ కార్యాలయం

సరూర్నగర్ సర్కిల్ గ్రౌండ్ ఫ్లోర్లోని టౌన్ప్లానింగ్ ఏసీపీ చాంబర్ కార్యాలయం: రిటర్నింగ్ అధికారి వి. శ్రేయ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి: సత్యప్రసాద్

 

చైతన్యపురి డివిజన్ రిటర్నింగ్ కార్యాలయం

సరూర్నగర్ సర్కిల్ గ్రౌండ్ ఫ్లోర్లోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం : రిటర్నింగ్ అధికారి సి.హెచ్. జ్యోతి శ్రీ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి : సయ్యద్ అబ్దుల్ ఇర్షాద్

 

గడ్డిఅన్నారం డివిజన్ రిటర్నింగ్ కార్యాలయం...

సరూర్నగర్ సర్కిల్ గ్రౌండ్ ఫ్లోర్లోని డీఈ చాంబర్ కార్యాలయం: రిటర్నింగ్ అధికారి ఎం. సురేశ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి: జి. సునిత

 

జీడిమెట్ల : కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని ఎనిమిది వార్డుల రిజర్వేషన్ల వివరాలను జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. గాజులరామారం(125) డివిజన్ బీసీ జనరల్, జగద్గిరిగుట్ట(126) డివిజన్ బీసీ జనరల్, రంగారెడ్డినగర్(127) డివిజన్ బీసీ జనరల్, చింతల్(128) డివిజన్ బీసీ మహిళా, సూరా రం(129) డివిజన్ జనరల్, సుభాష్నగర్(130) డివిజన్ జనరల్ మహిళా, కుత్బుల్లాపూర్(131) డివిజన్ జనరల్ మహిళా, జీడిమెట్ల(132) డివిజన్ జనరల్ మహిళకు కేటాయించారు.

 

నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధం

గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించేందుకు గాజులరామారం సర్కిల్ పరిధిలో గాజులరామారం, జగద్గిరిగుట్ట, చింతల్, సూరారం వార్డులకు ప్రత్యేకంగా అధికారులు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో రంగారెడ్డినగర్, సుభాష్నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల వార్డులకు గానూ నామినేషన్ల దరఖాస్తు కోసం ప్రత్యేకంగా కేంద్రాలు పెట్టారు. నామినేషన్లను నేటి నుంచి 20 తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

 

ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వీరే!

డివిజన్ల వారీగా రిటర్నింగ్ అధికారులను నియమించారు. గాజులరామారం డివిజన్ రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో)గాకే సుజాత(99495 56430/79892 52438), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్(ఏఆర్వో)గా టీ. అనంత పద్మనాభం(94406 98918), జగద్గిరిగుట్ట ఆర్వోగా పీ. సుమతి(99495 56450/99894 77925 ), ఏఆర్వోగా సీహెచ్ రవీందర్రాజు(9849792912), రంగారెడ్డినగర్ ఆర్వోగా డీ మల్లేశ్వర్(95151 20704), ఏఆర్వోగా కేఎన్ సుజాత(9441243074), చింతల్ ఆర్వోగా కే. సుజాత నాయక్(99495 56431/96403 70126), ఏఆర్వోగా మురళీకృష్ణమూర్తి(8341000886), సూరారం ఆర్వోగా ఎస్పీ జయలక్ష్మి(99495 56429/7095507475), ఏఆర్వోగా బీ శ్రీధర్(98667 90190), సుభాష్నగర్ ఆర్వోగా కే. మాధవి(89787 79737), ఏఆర్వోగా లక్ష్మీదేవి(9392222112), కుత్బుల్లాపూర్ ఆర్వోగా . చంద్రశేఖర్(7095507010/9573889023), ఏఆర్వోగా కేవీ అమర్జ్యోతి(8909594455), జీడిమెట్ల ఆర్వోగా విశ్వప్రసాద్(7095507484), ఏఆర్వోగా టీ విజయరెడ్డి(9705171201) వ్యవహరించనున్నారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *