Top Ad unit 728 × 90

అత్యాశకి పోయిన కృతిశెట్టికి తగిన శాస్తి జరిగిందా.


అత్యాశకి పోయిన కృతిశెట్టికి తగిన శాస్తి జరిగిందా. ఇదే హాట్ టాపిక్‌...!

 

కుర్ర భామ కృతికి శెట్టికి గట్టి దెబ్బలే తగిలాయి. కెరీర్ ప్రారంభంలో వరుసగా హిట్స్ వస్తే ఆ హీరోయిన్ వెనక జోరీగల్లా అందరూ పడుతుంటారు. అది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, మిగతా సౌత్ భాషల్లోనూ, బాలీవుడ్‌లోనూ ఉన్నదే.

 

కొత్తగా వచ్చిన హీరోయిన్ నటించిన సినిమా ఒకటి బ్లాక్ బస్టర్ అయితే, ముదురు హీరోలు కూడా ఆ అమ్మాయి సరసన నటించాలని తెగ ఆరాటపడుతుంటారు.

 

ఇంకేముంది..ఇదే మంచి అవకాశం అనుకునే హీరోయిన్స్ వయసుతో పనిలేకుండా సీనియర్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వస్తే కూడా వదలకుండా సైన్ చేసేస్తారు. అదే ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా చేసింది. ఉప్పెన సినిమా భారీ హిట్ సాధించడంతో వరుసగా ఐదారు సినిమాలకు సంతకం చేసింది. వాటిలో నాని, నితిన్, రామ్‌ పోతినేని, నాగచైతన్య - నాగార్జున, తమిళ హీరో సూర్య, సుధీర్ బాబు హీరోలుగా చేసిన సిన సినిమాలున్నాయి.

 

వీటిలో ఇప్పటికే, నాని... నాగ చైతన్య, రామ్‌ సినిమాలు వచ్చాయి. అయితే, వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతికి రామ్‌ సినిమా ది వారియర్ ఫస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాలో సాంగ్స్‌తో అమ్మడు బాగానే ఊపేసింది. దాంతో ది వారియర్ మూవీతో మళ్ళీ హిట్ అందుకుంటుందని అందరూ చెప్పుకున్నారు. కట్ చేస్తే నాలువగ సినిమా ఫ్లాప్. ఇప్పుడు వచ్చిన మాచర్ల నియోజక వర్గం సినిమా కూడా డిజాస్టర్‌గా మిగిలింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో కృతికి గట్టి షాక్ తగిలినట్టైంది.

 

దీన్ని బట్టి చూస్తే కథలను ఏమాత్రం వినకుండా వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టు ఒప్పేసుకుంది అని అర్థమవుతోంది. మూడు హిట్స్‌తో కోటి అందుకున్న రెమ్యునరేషన్ కాస్త ఇప్పుడు కొండనుంచి దిగిందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా కృతికి కష్ట కాలం మొదలైందేమో అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా కృతి ఇప్పటకీ అయినా ఎడాపెడా సినిమాలు ఒప్పుకోవడం కంటే కథ మీద కాన్‌సంట్రేషన్ చేస్తేనే లైఫ్ ఉంటుంది.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *