'ది జర్నీ ఆఫ్ విశ్వం' పేరుతో మేకింగ్ వీడియో విడుదల
'ది జర్నీ ఆఫ్ విశ్వం' పేరుతో మేకింగ్ వీడియో విడుదల
జర్నీ ఆఫ్ విశ్వం గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ హై -వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 'ది జర్నీ ఆఫ్ విశ్వం' పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
ఇందులో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయో తెలియజేసేలా ఉన్న ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ సీన్స్‌తో పాటు శ్రీనువైట్ల మార్క్ ఎంటర్‌టైన్మెంట్ ఉండబోతున్నట్టు విజువల్స్‌ను చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా విదేశీ లొకేషన్స్, యాక్షన్ సీన్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీను వైట్లతో పలు సూపర్ హిట్స్ ఇచ్చిన గోపీ మోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.
