Top Ad unit 728 × 90

బర్త్డే కానుకగా టీజర్ రిలీజ్


బర్త్డే కానుకగా టీజర్ రిలీజ్

 

దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం 'పుష్ప-2 ది రూల్'. తాజాగా చిత్ర యూనిట్ ఇచ్చిన అప్డేట్తో అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబరాల్లో ఉన్నారు.

 

ఈనెల 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్... ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు... తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్గా తెరకెక్కుతోన్న 'పుష్ప-2 ద రూల్' చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజరు, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్, సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *