Top Ad unit 728 × 90

పార్ట్ 2 పక్కానా. సీక్వెల్స్ విషయంలో సస్పెన్స్‌


పార్ట్ 2 పక్కానా. సీక్వెల్స్ విషయంలో సస్పెన్స్‌

 

సీక్వెల్ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌. సీక్వెల్‌ ఉంటుందా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సంబంధం లేని సమాధానంతో షాక్ ఇచ్చారు.

 

దీంతో సీక్వెల్ విషయంలో డైలమాలో పడిపోయారు ఫ్యాన్స్. ఒక్క ఈ విషయంలో మాత్రమే కాదు. సెట్స్ మీద ఉన్న చాలా ల విషయంలో ఇలాంటి డైలమానే కంటిన్యూ అవుతోంది. సలార్‌ రిలీజ్‌కు ముందే సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌.

 

సీక్వెల్ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌. సీక్వెల్‌ ఉంటుందా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సంబంధం లేని సమాధానంతో షాక్ ఇచ్చారు. దీంతో సీక్వెల్ విషయంలో డైలమాలో పడిపోయారు ఫ్యాన్స్. ఒక్క ఈ విషయంలో మాత్రమే కాదు... సెట్స్ మీద ఉన్న చాలా ల విషయంలో ఇలాంటి డైలమానే కంటిన్యూ అవుతోంది.

 

సలార్‌ రిలీజ్‌కు ముందే సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. కానీ ఇప్పుడు పార్ట్‌ 2, ఎప్పుడు ఆడియన్స్‌ ముందుకు వస్తుంది అన్న విషయం అర్ధం కావటం లేదు. సలార్ రిలీజ్ తరువాత ఎన్టీఆర్ పనులు స్టార్ట్ చేశారు ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ కూడా అదర్ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టేశారు. దీంతో సలార్ 2 ఇప్పట్లో లేనట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

 

దేవర విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. దేవర తరువాత వార్ 2, ప్రశాంత్‌ నీల్ మూవీ చేసేందుకు ప్లాన్ చేశారు ఎన్టీఆర్‌. ఈ రెండూ భారీ చిత్రాలే కావటంతో అవి పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయమన్నా పడుతుంది. అంటే ఆ తరువాతే దేవర 2 పట్టాలెక్కుతుందన్న మాట.

 

పుష్ప 2 షూటింగ్ టైమ్‌లోనే పుష్ప 3 కూడా ఉంటుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్‌. కానీ ఇంకొంత కాలం అల్లు అర్జున్‌ అదే వరల్డ్‌లో కంటిన్యూ అవుతారా? అన్నది అనుమానామే. ఆల్రెడీ చెర్రీతో నెక్ట్స్‌ ఉంటుందని ఎనౌన్స్ చేశారు సుకుమార్‌. బన్నీ లిస్ట్‌లో కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యాకే పుష్ప 3 విషయంలో క్లారిటీ వస్తుంది.

 

గతంలో ట్రిపులార్‌కి కూడా సీక్వెల్‌ ఉంటుందన్న హింట్ ఇచ్చారు రచయిత విజయేంద్ర ప్రసాద్‌. ఆల్రెడీ పాయింట్ కూడా ఓకే అయ్యిందని చెప్పారు. కానీ ఇంతవరకు మహేష్ మూవీనే స్టార్ట్ చేయని జక్కన్న ట్రిపులార్ 2 గురించి ఇప్పట్లో ఆలోచించే ఛాన్సే లేదు. అంటే ఈ ప్రాజెక్ట్‌ నియర్ ఫ్యూచర్‌లో ఉండే అవకాశమే లేదన్న మాట. సో మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్స్ విషయంలో ఈ సస్పెన్స్ ఇంకొంత కాలంగా ఇలాగే కంటిన్యూ అవ్వటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్‌.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *