Top Ad unit 728 × 90

వృద్ధురాలి పై అత్యాచారం


వృద్ధురాలి పై అత్యాచారం, హత్యసంచలనంగా మారిన వృద్ధురాలి హత్యసంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్. పోలీసులఅదుపులో నిందితుడు

 

రొంపిచర్ల మండలంలో విప్పర్ల గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన వృద్ధురాలిపై అత్యాచారం, హత్య సంచలనంగా మారింది. మద్యం మత్తులో యువకుడు ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారం చేసి  అనంతరం హత్య చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో  విప్పర్ల గ్రామంలో షేక్ మస్తాన్ బి(65) అనే వృద్ధురాలు తన ఇంటి ముందు నిద్రిస్తున్నారు. ఆ ఇంటికి సమీపంలో ఉన్న పెరవలి మణికంఠ అనే యువకుడు మద్యం మత్తులో ఇంటి ముందు నిద్రిస్తున్న షేక్ మస్తాన్ బి పై అత్యాచారం చేసి అనంతరం దిండుతో ఆమెపై ఒత్తిడి చేసి హత్య చేశారు. రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా గ్రామస్తులు తెలుపుతున్నారు.  తెల్లవారు జామున ఇంటి ముందు మస్తాన్ బి మంచం మీద జీవచ్ఛవం లాగా పడిఉండి శరీరం పై తీవ్రగాయాలు కావటంతో గ్రామస్తులు అవాక్కుఅయ్యారు.  ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా వారు గుర్తించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న డి.ఎస్.పి భాస్కర్ రావు, నరసరావుపేట రూరల్ సిఐ భక్తవత్సల రెడ్డి, నరసరావుపేట రూరల్ ఎస్. ఐ పి.హజరత్తయ్య, ఎస్.ఐ సురేష్ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించి అక్కడికి సమీపంలో ఉన్న పెరవలి మణికంఠ ఇంటికి వెళ్లడం జరిగింది. దీనిపై మణికంఠ విచారించగా జరిగిన సంఘటన వివరించారు. తానే ఈ సంఘటనకు పాల్పడినట్లు గా తెలిపారు. అనంతరం పోలీసులు మణికంఠను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతదేహమును  పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా మృతురాలి భర్త  షేక్ నన్నే కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ సురేష్ తెలిపారు. ఈ సంఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

కరణ: రవిబాబు అరిగెల (రిపోర్టర్, ఏలూరు జిల్లా)

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *