Top Ad unit 728 × 90

భారాస సెక్యులర్‌ పార్టీ: కేటీఆర్‌


భారాస సెక్యులర్‌ పార్టీ: కేటీఆర్‌

 

సీఏఏకు వ్యతిరేకంగా పోరాడుతాం

ఖర్జూరం తినిపిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌. చిత్రంలో

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి భారాస అభ్యర్థి లక్ష్మారెడ్డి

 

డిఫెన్స్‌కాలనీ: భారాస సెక్యులర్‌ పార్టీ... దానికి విఘాతం కలిగించేలా ఏ నిర్ణయం తీసుకున్నా దిల్లీలో భారాస పోరాడుతుందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నేరేడ్‌మెట్‌లోని జీకే సరస్వతి వేడుకల మందిరంలో ఇఫ్తార్‌ విందుకు ఆయన హాజరయ్యారు. సాయంత్రం 6.30 సమయంలో ముస్లింలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఖర్జూరం తినిపించి రోజా విరమింపజేశారు.

 

గ్రేటర్‌లో ప్రజలు ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించారని... ఈ ఎన్నికల్లోనూ అదే సహకారం అందివ్వాలని కోరారు. పది సంవత్సరాలుగా తమకు అండగా ఉన్న ముస్లింలు గతంలోలాగే ఆదరించాలని కోరారు. సీఏఏకు వ్యతిరేకంగా భారాస పోరాడుతుందన్నారు. మాజీ హోం మంత్రి మహమూద్‌ అలీ, మల్కాజిగిరి భారాస ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు మీనారెడ్డి, సబిత, సునీత, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *