Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 21 సెప్టెంబర్ 2022


ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 21 సెప్టెంబర్ 2022

 

డా. యం.ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

గమనిక: ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. డా. ఎం. ఎన్. ఆచార్య.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు బంధువుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో మార్పులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి. ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు ఉద్యోగాలలో విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వాహనయోగం ఉన్నది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. ఇంటా బయట విచిత్ర సంఘటనలు పూర్తి చేసుకుంటాయి. నూతన వస్తులాభాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీకు రావలసిన గుర్తింపు వేరే వారికి వస్తుంది చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్పదు. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు వత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యసమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆలోచన తప్పదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహమున బందు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *