Top Ad unit 728 × 90

బీజేపీకి 295 నుంచి 315 సీట్లు


బీజేపీకి 295 నుంచి 315 సీట్లు

 

-అమెరికా రాజనీతి శాస్త్రవేత్త బ్రెమర్‌ విశ్లేషణ

 

న్యూఢిల్లీ: భారత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి కూడా విజయం సాధించనుందని అమెరికా రాజనీతి శాస్త్రవేత్త ఇయాన్‌ బ్రెమర్‌ తెలిపారు.

 

295 నుంచి 315 స్థానాల వరకు గెలుచుకుంటుందన్నారు. భారత ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికం, స్వేచ్ఛాయుతం, పారదర్శకంగా ఉందని ప్రశంసించారు. అద్భుత ఆర్థికాభివృద్ధి కారణంగా ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ హ్యాట్రిక్‌ గెలుపు అందుకోనుందని తెలిపారు. బ్రెమర్‌... రిస్క్‌-రీసెర్చ్‌ కన్సల్టింగ్‌ సంస్థ అయిన యూరేసియా గ్రూపు వ్యవస్థాపకుడు. ప్రపంచ రాజకీయ దృక్కోణంలో భారతీయ సార్వత్రిక ఎన్నికలు మాత్రమే స్థిరత్వం కలిగినవని... అమెరికా సహా ఇతర దేశాల ఎన్నికలు సమస్యాత్మకమైనవని ఆయన పేర్కొన్నారు. యూరోపియన్‌ యూనియన్‌, యూకే సహా ప్రపంచంలోని అన్ని ఎన్నికల్లోకెల్లా... అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మాత్రమే ఎన్నికల తర్వాత సజావుగా అధికార మార్పిడి జరుగుతుందని తెలిపారు.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *