Top Ad unit 728 × 90

కౌలు రైతు ఆవేదన: తప్పు ఒకరిదైతే శిక్ష ఇంకొకరికా...!


ఖమ్మం జిల్లాలో మహిళా కౌలు రైతు ఎమ్మెల్యే ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. గత నెలలో వారు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న భూమిలో పని చేస్తున్న ఇద్దరు కూలీలు విద్యుత్ షాక్ తో చనిపోయారు. అయితే కూలీలకు రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాలని గ్రామంలో పెద్దమనుషులు తీర్మానం చేయడంతో మహిళా రైతు ఆత్మహత్యకు యత్నించింది. వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన వ్యవసాయ కూలీలైన ఆనందరావు, పార్వతి దంపతులు గత నెల 15 చెరకు తోటలో పని చేస్తూ కరెంట్ షాక్ తో మృతిచెందారు.

పొలంలో నుంచి పోతున్న విద్యుత్ తీగలు కిందకు వాలడంతో అవి తగిలి వారిద్దరూ ఉన్నచోట ఉన్నట్టే ప్రాణాలొదిలారు. అయితే ఘటనకు బాధ్యులైన విద్యుత్ ఉద్యోగులపై ఇప్పటిదాకా కనీసం విచారణ లేదు, చర్యలు కూడా తీసుకోక పోవడం గమనార్హం. అయితే లోగా స్థానిక పెద్ద మనుషులు మృతుడి కుటుంబానికి రూ. పది లక్షలు ఇవ్వాలని సదరు కౌలు రైతుకు హుకుం జారీ చేశారు.

అంత మొత్తం ఇచ్చే శక్తి ఉంటే కౌలు ఎందుకు చేసుకుంటాం, అయినా తప్పు చేసినోళ్లను వదిలేసి శిక్ష మాకేయడమేంటంటూ వారు గోడు వెల్లబోసుకున్నా కనికరం చూపలేదు. దీంతో సోమవారం తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి తమ గోడు చెప్పుకుని విలపించారు. అయితే స్పందన లేకపోవడంతో ఆయన సమక్షంలోనే బాధిత కౌలు రైతు తుమ్మల దివ్య పురుగుల మందు తాగింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *