Top Ad unit 728 × 90

కడుపులో ఉండగా అమ్మయన్నారు, పుట్టిన తర్వాత అబ్బాయిగా, వయసుకోచ్చాక...!


అచ్చంగా మగాడిగా పుట్టి, పురుషాంగం కలిగిఉండి, దాన్ని కత్తిరించుకోకుండానే గర్భం దాల్చిన టీనేజర్ నిజ జీవిత గాథ. ఈ మధ్య ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోన్న 18 ఏళ్ల మైకీ చానెల్ అసలు విషయం ఏమిటంటే....!

అతనిది అమెరికాలోని బోస్టన్ నగరం. తను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు స్కానింగ్ చేయగా, అమ్మాయేనని డాక్టర్లు సర్టిఫై చేశారు. తీరా ప్రసవం తర్వాత చూస్తే పురుష జననాంగాలతో కనిపించాడు. స్కానిగ్ చేసిన నిపుణులు, అక్కడ ఉన్న  డాక్టర్లు, నర్సులతోపాటు తల్లిదండ్రులకు కూడా అదొక పెద్ద షాక్. ఇక పుట్టిన పిల్లాడికి మైకీ చానెల్ అని పేరు పెట్టారు. కానీ వయసుతో పాటు ఎన్నో మార్పులు.

మైకీ పెద్దవుతోన్న కొద్దీ తనలో అన్నీ ఆడ లక్షణాలే ఉన్నాయని గుర్తించాడు. ఒక్క పురుషాంగం తప్ప మిగతా శరీర భాగాలన్నీ అమ్మాయిల మాదిరిగానే పెరుగుతూ వచ్చాయి. దశలో స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడేవాడు. అతని శరీరం, ప్రవర్తనను ఎద్దేవా చేస్తూ ఏడిపించనివాళ్లంటూ లేరు. అతి కష్టం మీద కొనడుకును కాపాడుకుంటూ వచ్చారు మైకీ తల్లిదండ్రులు. 13 ఏళ్ల వయసు నాటికి తను ట్రాన్స్ జెండర్ అనే స్పృహ కలిగింది. తర్వాత ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవడం మానేశాడు.

ప్రస్తుతం మైకీ చానెల్ వయసు 18 ఏళ్లు. కొంత కాలంగా అతను మూత్రం పోసేటప్పుడు పురుషాంగంలో విపరీతమైన నొప్పి, ఇబ్బంది తలెత్తాయి. ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోగా షాకింగ్ విషయం బయటపడింది. మైకీ జననాంగం లోపలి భాగంలో అండాల ఉత్పత్తి జరుగుతోందని, అతని కడుపులో గర్భాశయం, ఫెలోపియన్ ద్వారాలు కూడా ఉన్నాట్లు డాక్టర్లు గురించారు. ఇంకొన్ని పరీక్షల తర్వాత, అతను గర్భం దాల్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.


నేను కూడా పిల్లల్ని కనొచ్చని డాక్టర్లు చెప్పినప్పుడు చుట్టూ పరికించి చూశాను. ఎవరైనా ప్రాంక్ వీడియో చేస్తున్నారేమో అనుకున్నా. కానీ అది సీరియస్ విషయమని అర్థమయ్యాక నిజంగా సంతోషించాను. అమ్మాయిగా ఉండాలన్నదే నా కోరిక. ఇక అమ్మతనాన్ని కూడా పొందే అదృష్టం రావడాన్ని వరంగానే ఫీలయ్యా. పలు రకాల పరీక్షల తర్వాత, ఐసిఎస్ సహా అనేక ఫెర్టిలిటీ విధానాల్లో ప్రయోగాలు చేశారు. దాత నుంచి స్పెర్మ్ తీసుకుని నాలోకి ప్రవేశపెట్టారు. 20 శాతమే ఛాన్స్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అదృష్టవశాత్తూ నాకు వర్కౌట్ అయింది. నా బిడ్డను బాగా పెంచుకుంటూ, ముందుగా డిగ్రీ పూర్తి చేయాలన్నది నా తాత్కాలిక లక్ష్యం అని మైకీ చానెల్ చెప్పుకొచ్చింది.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *