Top Ad unit 728 × 90

అసలు సిసలైన గ్యారంటీ మోదీనే


అసలు సిసలైన గ్యారంటీ మోదీనే

 

ప్రజల నమ్మకం అదేభాజపా ఎంపీలు గెలిస్తేనే రేవంత్‌కు మనుగడ

విజయ సంకల్ప యాత్రలో బండి సంజయ్‌ వ్యాఖ్యలు

 

షాద్‌నగర్‌ న్యూటౌన్‌, కొందుర్గు: అసలు సిసలైన గ్యారంటీ మోదీనేనని ప్రజలు నమ్ముతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు.

 

లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 'తెలంగాణలో భాజపా ఎంపీలు అధిక సంఖ్యలో గెలవాలని సీఎం రేవంత్‌ కోరుకోవాలి. లేకుంటే కాంగ్రెస్‌ నాయకులే సీఎంను గద్దె దించేందుకు సిద్ధమవుతారు' అని వ్యాఖ్యానించారు. భాజపా కృష్ణమ్మ క్లస్టర్‌ విజయసంకల్ప యాత్ర గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ చేరుకుంది.

 

కొందుర్గు మండల కేంద్రం, షాద్‌నగర్‌లలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లలో సంజయ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం... హామీల అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కర్ణాటకలో ఆలయాలపై పన్ను విధించారని విమర్శించారు. కాంగ్రెస్‌ దేశప్రజలను దోచుకుందని, భారాస రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే గ్రామీణ వికాసం సాధ్యమైందని అన్నారు. నాయకులు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, శాంతకుమార్‌ పాల్గొన్నారు.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *