Top Ad unit 728 × 90

District News :

ఈరోజు మీ రాశిఫలాలు: శనివారం 14 ఆగస్టు 2021


ఈరోజు మీ రాశిఫలాలు: శనివారం 14 ఆగస్టు 2021

 

మేషం: ముఖ్యుల ఆరోగ్యం మిమ్మలను నిరాశపరుస్తుంది. అనుకోని ఖర్చులు, ఇతరాత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగస్తులు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది.

 

వృషభం: సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి వంటివి అధికం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉద్యోగస్తులు తోటివారితో విందులు వినోదాల్లో పాల్గొంటారు.

 

మిథునం: పత్రిక, ప్రైవేటు సంస్థలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కొత్త ప్రదేశంలో ఆహారం, నీరు, మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.

 

కర్కాటకం: బంధువుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలు వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది.

 

సింహం: రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఎదుటివారిని మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. స్వర్ణకారులు, వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. మీ మంచి కోరుకునే వారు కంటే మీ చెడును కోరుకునేవారే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

 

కన్య: రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అసవరం. పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాల వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.

 

తుల: ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.

 

వృశ్చికం: రావలసిన పత్రాలు, రశీదులు చేతికందుతాయి. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. వృథా ఖర్చులు అధికంగా ఉంటాయి. గతంలో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత మెరుగుపడుతుంది. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం మంచిది.

 

ధనస్సు: ప్రైవేటు సంస్థలలో వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం మంచిది.

 

మకరం: బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు ఆల్కహాలు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. స్వీయ సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. రుణ, విదేశీయాన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.

 

కుంభం: ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కలకమైన విషయాలు మీరే సమీక్షించుకోవడం మంచిది.

 

మీనం: మీ సంతానం ఉన్నత విద్యల గురించి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం వుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుంటారు. అనుకోని ఖర్చులు తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *