Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్‌ పనుల్లో జరిగిన ప్రమాదంలో టిప్పర్‌ ఢీకొని సూపర్‌వైజర్ వెంకటేష్ (33) మృతి కళావెంకట్రావు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వివాద రహితుడు, సౌమ్యుడు అజాతశత్రువు కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెట్టడం ఆటవిక చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకునే మార్గాన్ని సుగమం చేయనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త చట్టం: 15 ఏళ్లకు పైబడిన వాహనాలు ఇక చెత్తలోకే నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

హెచ్చరిక: మూడు రాష్ట్రాలకు తుఫాను ముప్పు...!


తెలుగు రాష్ట్రాలతో పాటూ తమిళనాడు రాష్ట్రానికి కూడా తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా మారుతుందని.. రేపు తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇరాన్ దేశం సూచించిన 'నివర్' అని ఈ తుఫానుకు పేరు పెట్టారు. నివర్ ఎల్లుండి తమిళనాడు, పుదుచ్చేరి తీరంలోని కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఇప్పటికే వర్ష ప్రభావం ఉందని, రాయలసీమలో రేపటి నుంచి, ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *